భారతదేశం, డిసెంబర్ 6 -- కోలీవుడ్ హీరో ధనుష్, బ్యూటిఫుల్ కృతి సనన్ జోడీగా తెరకెక్కిన బాలీవుడ్ మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్‌తోపాటు మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో తేరే ఇష్క్ మేకు వస్తోన్న టాక్‌పై స్పందించిన కృతి సనన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది.

-ఇది నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. ఈ సినిమాకు, ఒక నటిగా నాకు ఇంతలా ప్రేమ దక్కుతుందని ఊహించలేదు. సాధారణంగా ఒక సినిమాకు గొప్ప రివ్యూలు రావడం, నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడం, అదే సమయంలో భారీ బాక్సాఫీస్ నంబర్లు రావడం.. ఇవన్నీ ఒకేసారి జరగడం చాలా అరుదు. నాకు ఇవన్నీ ఒక్కసారే దక్కాయి. ఇంతకంటే నాకేం కావాలి.

-చాలా రీఫ్రెషింగ్‌గా అనిపించింది. కథ విన్నప్పుడు పేపర్‌ మీద శంకర్ (ధనుష్ రో...