Hyderabad, జూలై 19 -- వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ కొట్టేస్తూ వైరల్ అయిపోతోంది హీరోయిన్ శ్రీలీల. ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ మూవీ జూనియర్.

ప్రముఖ రాజకీయ, వ్యాపార వేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా జూనియర్. రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన జూనియర్ మూవీలో సీనియర్ బ్యూటి జెనీలియా కీలక పాత్ర పోషించింది. ఇక జూలై 18న థియేటర్లలో విడుదలైన జూనియర్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది.

ఇదిలా ఉంటే, జూనియర్ మూవీ థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ఇప...