Hyderabad, అక్టోబర్ 10 -- సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు, రీల్స్‌తో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ నిహారిక ఎన్ఎమ్. తెలుగులో నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్‌గా డెబ్యూ ఇస్తున్న సినిమా మిత్ర మండలి. ఈ మూవీలో హీరోగా ప్రియదర్శి చేశాడు. మిత్ర మండలి సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు.

బీవీ వర్క్స్ బ్యానర్ మీద నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల మిత్ర మండలి సినిమాను నిర్మించారు. మిత్ర మండలి సినిమా అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న మీడియా ఇంటర్వ్యూలో హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

-నేను ముందుగా ఈ 'మిత్ర మండలి' కథనే విన్నాను. కానీ 'పెరుసు' తమిళ చిత్రం ముందుగా రిలీజ్ అయింది. 'మిత్ర మండలి'లో ఉండే భారీ క్యాస్టింగ్ వల...