భారతదేశం, నవంబర్ 12 -- రష్మిక మందన్న ఈమధ్య ఒక టెలివిజన్ టాక్ షోలో పీరియడ్స్‌కు సంబంధించి చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారితీశాయి. పురుషులు కూడా ఆ బాధను అనుభవించాలని ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ.. షోలకు వెళ్లడానికి తనకు భయం వేస్తుందని వ్యాఖ్యానించింది.

నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా'లో రష్మిక మందన్న మాట్లాడింది. మహిళలు ప్రతి నెలా అనుభవించే పీరియడ్స్ నొప్పిని పురుషులు కూడా అనుభవించాలని ఆమె కామెంట్ చేసింది. ఈ కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం సృష్టించింది. పురుషులు కూడా సమాజంలో పడే కష్టాల గురించి పోల్చుతూ నెటిజన్లు రష్మికను విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో.. తాను షోలకు వెళ్లడానికి భయపడుతున్నానని నటి సోషల్ మీడియాలో తెలిపింది.

తన వ్యాఖ్యల...