భారతదేశం, జనవరి 24 -- హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న మంటలు. ఒక్కసారిగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

భవనంలో లోపల ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తించారు. వాచ్‌మెన్‌ కుటుంబంలో ఇద్దరు పిల్లలు, మరో కుటుంబంలోని నలుగురు పెద్దవారు చిక్కుకున్నట్లు తెలిసింది. చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను అఖిల్‌ (7), ప్రణీత్‌ (11)గా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు భవనం పరిసర ప్రాంతవాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది. 8 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు రోబో ఫైర్‌ మిష...