భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఉద్యాన పంటలు, ఎరువు లభ్యత, మార్కెటింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎరువలు లభ్యత, సరఫరా, ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ తరలకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

ఈసారి 2 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ఎరువులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఈ క్రాప్ ద్వారా ఎంత సాగు అవుతుంది, వినియోగం ఎంత అవుతుంది లెక్కించాలని సీఎం సూచించారు. పంటల సాగు, సరఫరా, లభ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని తద్వారా సమస్యలు రాకుండా చూసుకోవాలని చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. ఎరువులు, పురుగుల మందుల వినియోగం తగ్గించిన రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇచ్చే అంశాలను పరిశీలించాలని ఆదేశించారు.

ఉద్యాన పంటల...