భారతదేశం, ఆగస్టు 15 -- అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.6,608 కోట్లకు చేరింది. ఆర్థిక వ్యయాలు పెరగడంతో కంపెనీ ఈ నష్టాలు పెరిగినట్టుగా తెలుస్తోంది. గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ ఈ సమాచారాన్ని అందించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,426.7 కోట్ల నష్టాన్ని చూసింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో షేరు 3.45 శాతం నష్టంతో రూ.6.15 వద్ద ముగిసింది. గత ఏడాది కాలంలో కంపెనీ షేరు 61 శాతం పతనమైంది.

2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా నిర్వహణ ఆదాయం 5 శాతం పెరిగి రూ.11,022.5 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.10,508.3 కోట్లుగా ఉంది. 2024-25 జూన్ త్రైమాసికంలో రూ.154గా ఉన్న కంపెనీ సగటు యూజర్ ఆదాయం(ఏ...