భారతదేశం, మే 6 -- భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ మే 6 మంగళవారం నష్టాలతో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన ఫలితాలకు ముందు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను మరింత దెబ్బతీశాయి. మంగళవారం, మే 6వ తేదీన సెన్సెక్స్ 156 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 80,641 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 24,379.60 వద్ద ముగిశాయి.

సెన్సెక్స్, నిఫ్టీ 50లు స్వల్ప నష్టాలతో ముగియగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. బిఎస్ ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.16 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.33 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 427 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.421 లక్షల కోట్లకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఒకే సెషన్లో దాదాపు రూ.6 లక్షల కోట్ల...