భారతదేశం, అక్టోబర్ 31 -- భారీ వర్షాలతో 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల 12 జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సి ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వారం రోజుల్లో సమగ్రమైన నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.

భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేశారు. అనంతరం హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రులు, కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశ...