భారతదేశం, జూలై 27 -- జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను నవోదయ విద్యాలయ సమితి(NVS) త్వరలో ముగించనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 29 వరకు cbseitms.rcil.gov.in/nvsలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ డిసెంబర్ 13 శనివారం జరగనుంది. ఈ దశలో JNVST ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ (దిబాంగ్ వ్యాలీ & తవాంగ్ జిల్లాలు తప్ప), బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ (చంబా, కిన్నౌర్, మండి, సిర్మౌర్, కులు, లాహౌల్ & స్పితి, సోలన్, సిమ్లా జిల్లాలు తప్ప), జమ్మూ అండ్ కాశ్మీర్ (జమ్మూ-1, జమ్మూ-II, సాంబా & ఉధంపూర్‌లకు మాత్రమే) జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత...