Hyderabad, సెప్టెంబర్ 17 -- దసరా నవరాత్రులు 2025: హిందువులు నవరాత్రులను ఘనంగా జరుపుతారు. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని పూజించి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారిని ప్రతిష్టించి, భక్తితో పూజలు చేస్తారు. త్వరలో దసరా రాబోతోంది. కనుక ఇప్పటికే చాలా మంది నవరాత్రుల పనుల్ని మొదలుపెట్టే ఉంటారు. ఈ తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని ప్రతిష్టించి, దీపారాధన చేసి పూజలు చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

అమ్మవారి ఎదుట దీపారాధన చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. కర్పూరం వెలిగిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నవరాత్రుల సమయంలో ఈ కర్పూరానికి సంబంధించిన కొన్ని పరిహారాలను చూద్దాం. వీటిని పాటించినట్లయితే అమ్మవారి అనుగ్రహం పూర్తిగా కలిగి, సకల సంత...