Hyderabad, మార్చి 26 -- చైత్ర నవరాత్రులు మొదలయ్యే రోజు వచ్చేస్తోంది. హిందూమతంలో ఈ పవిత్రమైన నవరాత్రి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి ఆ పండుగకు ముందుగానే ఇంటిని సిద్ధం చేసుకుంటారు.

తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఇంటికి వస్తారని భక్తుల నమ్మకం. అందువల్ల ఇంటిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. మీరు కూడా నవరాత్రులకు శుభ్రం చేస్తుంటే, ఖచ్చితంగా కొన్ని వస్తువులను ఇంటి నుండి బయటకు పడేయాలి. ఇవి మీ ఇంటి అలంకరణను పాడు చేయడమే కాకుండా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. నవరాత్రులు మొదలయ్యే ముందు ఇంటి నుంచి ఎలాంటి వస్తువులు బయట పడేయాలో తెలుసుకోండి.

మీ ఇంట్లో కూడా చిరిగిన బట్టలు, బూట్లు ఉంటే నవరాత్రుల ప్రారంభానికి ముందే బయటపడేయండి...