భారతదేశం, నవంబర్ 25 -- భాగ్యనగరవాసులకు వాటర్ బోర్డు అధికారులు అలర్ట్ ఇచ్చారు. విద్యుత్ మరమ్మతుల పనుల కారణంగా కృష్ణా జిల్లాల పంపింగ్‌ను ఆరు గంటలు నిలిపివేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన కృష్ణా జలాలు బంద్ చేయనున్నట్టుగా వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

విద్యుత్ మరమ్మతుల కారణంగా 6 గంటలపాటు కృష్ణా జలాల పంపింగ్ ఆగిపోతుంది. కృష్ణా ఫేజ్‌-i, ii, iii పంపింగ్‌ స్టేషన్లకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసే బల్క్‌ ఫీడర్ల నిర్వహణ చేస్తున్నారు అధికారులు. అంతేకాదు.. దెబ్బతిన్న కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్స్ అమర్చనున్నారు.

ఈ కారణంగా నాగర్జున సాగర్ సమీపంలోని నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్స్ దగ్గర ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లకు బుధవారం ఉదయం 10 నుంచి సా...