భారతదేశం, అక్టోబర్ 27 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజమే. గ్రహాలు రాశి మార్పు చేసినా, నక్షత్ర మార్పు చేసినా, అది మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతూ ఉంటారు. అలాగే ఒక్కోసారి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సంపద, సౌందర్యం, ప్రేమకు కారకుడు అయినటువంటి శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను కూడా పొందుతారు. నవగ్రహాల్లో సంపదకు ప్రతీక అయినటువంటి శుక్రుడు వృషభ, తులా రాశులకు అధిపతి. ప్రేమ, అభిలాష, అందం, శ్రేయస్సు మొదలైన వాటికి కారకుడు.

నవంబర్ 2వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన...