భారతదేశం, అక్టోబర్ 31 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహ సంచారంలో మార్పు వచ్చినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కూడా కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రతినెలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు రాశి మార్పు చెందినప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది.

సూర్యుడు నిర్దిష్ట సమయంలో నక్షత్రాన్ని కూడా మారుస్తూ ఉంటాడు. సూర్యుడు నక్షత్రాన్ని మార్చినప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో రకరకాల మార్పులను తీసుకువస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యుడు నక్షత్ర మార్పు చెందినప్పుడు కెరీర్, ఫైనాన్స్, వ్యాపారం మొదలైన వాటిపై ప్రభావం చూపిస్తుం...