భారతదేశం, నవంబర్ 12 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆ శుభ యోగాలు, అశుభ యోగాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఒక్కోసారి శుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి, దాంతో జీవితమంతా ఒక్కసారిగా మారిపోతుంది. నవ పంచమ దృష్టి యోగం ప్రత్యేకమైన యోగం. ఇది సూర్య-గురువుల కలయిక వలన ఏర్పడుతుంది. త్వరలోనే ఈ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. నవంబర్ 17న సూర్యుడు, గురువు సంయోగం చెందడంతో ఈ నవ పంచమ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది.

సూర్యుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లీడర్షిప్, సక్సెస్ వంటి వాటికి కారకుడు. గురువు విజ్ఞానం, అదృష్టం వంటి వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థిక పరంగా బాగ...