భారతదేశం, అక్టోబర్ 29 -- ఈ ఏడాది దేవుత్తాన ఏకాదశి నవంబర్ 1న వచ్చింది. ఆ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. అయితే ఈ సంవత్సరం వచ్చే దేవుత్తాన ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు ఒక ప్రత్యేక యోగం కూడా ఏర్పడబోతోంది. రవి యోగం, మహాపురుష రాజయోగం కలయిక ఆ రోజు చోటు చేసుకోబోతోంది. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు.

సుమారు 142 రోజుల తర్వాత ఆ విష్ణుమూర్తి మేలుకొంటారు. అయితే ఆ రోజున కొన్ని రాశుల వారు విశేష ఫలితాలను చూస్తారు. మరి దేవుత్తాన ఏకాదశి ఎవరికి కలిసి వస్తుంది, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడే తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారికి విష్ణువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఏకాదశి నాడు ఈ రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టాలనుక...