Hyderabad, అక్టోబర్ 13 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే ప్రతి గ్రహం కూడా జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతూ ఉంటుంది. శుక్రుడు ధనం, సంపద, విలాసాలకు కారకుడు. త్వరలో శుక్రుడు సంచారం జరగబోతోంది. శుక్రుడి రాశి మార్పు అనేక రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. నవంబర్ నెలలో శుక్రుడు ఐదు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు. నవంబర్ 2న సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 7న స్వాతి నక్షత్రంలోకి అడుగు పెడతాడు. నవంబర్ 13న విశాఖ నక్షత్రంలోకి వెళ్తాడు.

అదే విధంగా నవంబర్ 26న వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నవంబర్ 29న అనురాధ నక్షత్రంలోకి ప్రవే...