Telangana,hyderabad, అక్టోబర్ 11 -- నవంబర్ నెలాఖరు నాటికి టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ లో ఏఐ హబ్, టీ-స్క్వేర్‌పై సమీక్షించిన ఆయన. 24 గంటల పాటు టీ-స్క్వేర్‌ పనిచేయాలన్నారు. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వి హబ్ నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వి హబ్ లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలన్నారు.

ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో భవనాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయా...