భారతదేశం, జనవరి 4 -- ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు గురించి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో సోమవారం కీలకమైన విచారణ జరగనున్న నేపథ్యంలో చట్టపరమైన వాదనలను బలంగా వినిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ విస్తరణ పనులను సవాలు చేస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. నీటిపారుదల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సాంకేతిక, చట్టబద్ధమైన, పరిపాలనా ఉల్లంఘనలపై న్యాయ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి వివర...