భారతదేశం, మే 19 -- పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది.. పోడు భూముల్లో సోలార్ పంపుసెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లు అందిస్తామని ప్రకటించారు.

'ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆ దిశగా అధికారులకు సూచనలు చేశా. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రూ. 60 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసింది. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతోపాటు రూ. 500...