Telangana,nagarkurnool, జూలై 12 -- నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీశాఖలో పని చేస్తున్న బీట్ ఆఫీసర్ 10 రోజుల కిందట అదృశ్యమయ్యాడు. అతని జాడ కోసం గాలిస్తుండగా. అటవీ ప్రాంతంలోనే తీవ్ర గాయాలతో ఉన్న అతని మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని పుల్లాయిపల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లయ్య శవమై కనిపించాడు. అటవీ, పోలీసు అధికారులు గాలింపు చేపట్టగా. పది రోజుల తర్వాత అతని మృతదేహాన్ని గుర్తించారు. పుల్లాయిపల్లి అటవీ ప్రాంతానికి సమీపంలోని మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎలుగుబంటి దాడి వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

"మరణించిన మల్లయ్య అనే అటవీ శాఖ అధికారి పది రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. మేము ఫిర్యాదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించాం. ప...