Hyderabad, ఏప్రిల్ 23 -- వేసవి కాలంలో చల్లని నీటి కోసం కుండను కొనే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కుండను కొంటూ ఉంటారు. మండుతున్న ఎండలు, వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్లని నీటిని తాగుతూ ఉండాలి.

సహజసిద్ధంగా నీటిని చల్లబరచేందుకు కొందరు మార్కెట్ నుంచి మట్టి కుండలు తెచ్చి వంటగదిలో ఉంచుతారు. మీరు కూడా ఫ్రిజ్ నుంచి చల్లటి నీరు తాగడం మానేసి, చల్లటి నీటి కోసం మట్టి కుండ కొనాలనుకుంటే, ఈ చిట్కాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ప్రస్తుతం మార్కెట్లో నలుపు, ఎరుపు రంగు కుండలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చల్లటి నీటికి ఏ రంగు కుండ కొంటే బాగుంటుందనే ప్రశ్న ప్రజల మదిలో మెదులుతోంది. మీరు కూడా ఈ సందిగ్ధంలో ఉంటే, మీ సమస్యను తీసేందుకు ఎరుపు, నలుపు రంగు కుండలలో ఏది కొనాలి? ఎందుకు కొనాలో తెలుసుకోండి.

ఎరుపు రంగు లేదా నల...