భారతదేశం, జూలై 25 -- బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆ మల్టీ టాలెంటెడ్ హీరో ఆ తర్వాత తన మూవీస్ ను తెలుగులోనూ తీసుకొస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. అలాంటి ఓ విభిన్నమైన కథతో రీసెంట్ గా 'మార్గన్' (Maargan) సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను అలరించాడు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

థియేటర్లలో అదరగొట్టిన మార్గన్ సినిమా ఇవాళ (జులై 25) ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మూడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఈ సినిమా ఓటీటీలో ప్రసారమవుతోంది.

ధృవ కుమార్ అలియాస్ ధృవ (విజ‌య్ ఆంటోనీ) ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్. ముంబయిలో అడిష‌న‌ల్ డీజీపీగా ప‌న...