Hyderabad, అక్టోబర్ 2 -- మలయాళ సినిమా దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ దాదాపు 16 సంవత్సరాల తర్వాత కలిసి నటించిన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పాట్రియాట్' టీజర్‌ను గురువారం (అక్టోబర్ 2) విడుదల చేశారు. వీళ్లతోపాటు ఫహాద్ ఫాజిల్, కుంచకో బొబన్, నయనతార కూడా ఇందులో నటించడం విశేషం. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమా గూఢచర్యం, యాక్షన్, దేశభక్తిని మేళవించిన ఒక గొప్ప సినిమాటిక్ విజువల్ ట్రీట్‌ను అందించనుందని టీజర్ స్పష్టం చేస్తోంది.

'పాట్రియాట్' టీజర్ ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌కు కావలసిన సరైన టోన్‌ను సెట్ చేసింది. ఈ కథ రిటైర్ అయిన జేఏజీ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రను మమ్ముట్టి పోషించాడు. గూఢచర్యం చేశారనే తప్పుడు ఆరోపణలతో అతను ఇరుక్కుంటాడు. తన పేరును క్లియర్ చేసుకోవడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి నిశ్చయించుకున్న అ...