భారతదేశం, సెప్టెంబర్ 8 -- 'మిర్జాపూర్' వంటి పాపులర్ వెబ్‌సిరీస్‌లో, 'మసాన్' వంటి మూవీలో మెప్పించిన నటి శ్వేతా త్రిపాఠీ తన అందం, యవ్వనంగా కనిపించే లుక్ వెనక గల రహస్యాలను పంచుకున్నారు. ఆమె వయసు 40 ఏళ్లు అంటే ఎవరూ నమ్మలేరు. తన చర్మ సౌందర్యం, ఫిట్‌నెస్‌కు కేవలం క్రీములు, మేకప్ మాత్రమే కారణం కాదని, మానసిక ఆరోగ్యం, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం చాలా ముఖ్యమని ఆమె చెబుతున్నారు. 'హెచ్‌టీ లైఫ్‌స్టైల్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేతా త్రిపాఠీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...

ఆహారం, ఆలోచనలు: మీరు తినే ఆహారం, తాగే పానీయాలు, మీ ఆలోచనలు మీ చర్మంపై చాలా ప్రభావం చూపుతాయి. నేను ఇంట్లో వండిన సాధారణ ఆహారాన్ని ఇష్టపడతాను. అందుకే హోటళ్లకు వెళ్లినా, షూటింగ్‌లో ఉన్నా, చెఫ్‌తో మాట్లాడి తక్కువ నూనె, బటర్‌తో వంట చేయమని అడుగుతాను. గత రెండేళ్లుగా నేను పూర్తిగా శాకాహారి...