భారతదేశం, ఆగస్టు 30 -- టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'బాఘీ 4' ట్రైలర్ ను శనివారం (ఆగస్టు 30) చిత్రబృందం విడుదల చేసింది. ఊహించినట్లుగానే ఇది యాక్షన్, హింస చుట్టూ సాగుతోంది. బాఘీ 4 ట్రైలర్ టైగర్ పాత్ర కేవలం గొడ్డలి పట్టుకుని విలన్లపై విరుచుకుపడే సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి హీరో, విలన్.. ఇలా నరుకుడే నరుకుడు. మొత్తం రక్తపాతం, వైలెన్స్ తో సాగుతుంది. మధ్యలో హీరోయిన్, కాస్త రొమాన్స్ ఉంటుంది.

బాఘీ 4 ట్రైలర్ చూస్తే హీరోయిన్ కోసం పిచ్చివాడిలా మారిపోయే టైగర్ ష్రాఫ్ లేని దాన్ని ఉన్నట్లు ఊహించుకుని గజినీలా ప్రవర్తిస్తాడని తెలుస్తోంది. మొదట నేవీ ఆఫీసర్ గా, ఆ తర్వాత మరింత క్రూరమైన అవతారంలో టైగర్ డిఫరెంట్ లుక్స్ కనిపిస్తాయి. రోనీ (టైగర్)ని ప్రపంచం మానసికంగా సరిగ్గా లేని వ్యక్తిగా చూస్తుంది. తను ప్రేమించిన అలీషా (హర్నాజ్...