భారతదేశం, జూలై 10 -- మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ 'నరివెట్ట' ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా ప్రకటించిన దాని కంటే ఒక రోజు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సూపర్ హిట్ మూవీ. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ ఆడియన్స్ ను అలరిస్తోంది. టొవినో థామస్ నటించిన ఆ పోలీస్ సోషల్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నరివెట్ట మూవీ ఈ రోజు (జూలై 10) ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా జూలై 11న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. గురువారం నుంచే ప్రసారమవుతుంది. సోనీ లివ్ ఓటీటీలో ఈ మూవీ అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

మే 23, 2025న థియేటర్లలో రిలీజైంది నరివెట్ట సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఈ...