భారతదేశం, డిసెంబర్ 10 -- రజినీకాంంత్ నటించిన 1999 నాటి బ్లాక్‌బస్టర్ మూవీ 'పడయప్ప'. ఇది తెలుగులో నరసింహ పేరుతో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ ర‌మ్య‌కృష్ణ‌ కెరీర్ లోనే స్పెషల్ గా నిలిచిపోయింది. ఈ పాత్ర ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. అయితే మొదట ఈ క్యారెక్టర్ కు అనుకున్న హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ‌ను కాదంటా. ఐశ్వర్య రాయ్ అని రజనీకాంత్ తాజాగా వెల్లడించారు.

పడయప్ప (నరసింహ) మూవీ మళ్లీ రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆ చిత్రం ప్రస్థానంపై ఒక ప్రత్యేక వీడియోలో మాట్లాడుతూ రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సినిమాలో నీలాంబరి పాత్రకు మొదట రమ్యకృష్ణను కాదని, ఐశ్వర్య రాయ్ తన మొదటి ఛాయిస్ అని సూపర్ స్టార్ వెల్లడించారు. అయితే, ఆమె ఆ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తి చూపలేదని తెలిసింది.

"మేము ఐశ్వర్య రాయ్ నీలాంబరి పాత్ర చేయాలని అ...