భారతదేశం, నవంబర్ 11 -- రద్దీ సమయంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. తాజాగా రద్దీని తగ్గించడానికి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. ప్రయాణికుల అదనపు రద్దీని తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే నరసాపూర్-సికింద్రాబాద్, అనకాపల్లి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

రైలు నెం. 07455 నరసపూర్ - సికింద్రాబాద్ (ఒక సర్వీస్).. 12 నవంబర్ 2025న ఉంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టాప్‌లలో ఆగుతుంది.

అలాగే రైలు నం. 07179 అనకాపల్లి - సికింద్రాబాద్ (ఒక సర్వీస్) 15 నవంబర్ 2025న ఉంది. స్టాప్‌లు: తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్...