భారతదేశం, ఏప్రిల్ 27 -- మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‍లో రూపొందనున్న చిత్రం(Mega157)పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ ఏడాది అనిల్ భారీ బ్లాక్‍బస్టర్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే టాక్‍తో మరింత క్రేజ్ ఉంది. ఈ సినిమా హీరోయిన్ పాత్ర కోసం స్టార్ నటి నయనతారను మేకర్స్ సంప్రదించారని సమాచారం.

ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్‍ను హీరోయిన్‍గా తీసుకోవాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, అది నిజం కాదని తేలిపోయింది. చిరంజీవి పక్కన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‍గా అయితే బాగుంటారని అనిల్ భావించారు. దీంతో ఆమెను మేకర్స్ సంప్రదించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.

ఈ చిత్రంలో నటించేందుకు నయన...