భారతదేశం, నవంబర్ 19 -- ప్రముఖ నటి, లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార తన 41వ పుట్టినరోజు వేడుకలను భర్త విఘ్నేష్ శివన్, కుమారులు ఉయిర్, ఉలగ్‌తో కలిసి జరుపుకుంది. ఈ సందర్భంగా విఘ్నేష్ ఆమెకు ఇచ్చిన ఖరీదైన బహుమతి, వేడుకలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

నటి నయనతార తన 41వ పుట్టినరోజును (నవంబర్ 18) భర్త విఘ్నేష్ శివన్, కవల కుమారులు ఉయిర్, ఉలగ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా విఘ్నేష్ ఆమెకు ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. తన ప్రియమైన భార్య పుట్టినరోజును చిరస్మరణీయం చేస్తూ.. విఘ్నేష్ దాదాపు రూ. 10 కోట్ల విలువైన విలాసవంతమైన కొత్త రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్రే కారును బహుమతిగా ఇవ్వడం విశేషం.

ఈ కారుతో ఉన్న ఫొటోలను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. తన ప్రియమైన నయనతారకు అందమైన శుభాకాంక్షలు తెల...