భారతదేశం, నవంబర్ 25 -- తన భర్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చిన కొన్ని గంటల తర్వాత మాజీ నటి సెలీనా జైట్లీ స్పందించింది. తన రాబోయే విడాకుల ప్రక్రియపై కూడా మాట్లాడింది. తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ నోట్‌ను పంచుకున్న సెలీనా.. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన తన న్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపింది.

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మంగళవారం (నవంబర్ 25) మధ్యాహ్నం తన ఫేస్‌బుక్ పేజీలో ఒక గ్రీన్ చీరలో కిటికీ దగ్గర కూర్చున్న థ్రోబ్యాక్ ఫొటో షేర్ చేస్తూ ఒక నోట్‌ను పంచుకుంది. "నా జీవితంలో అత్యంత బలమైన, అత్యంత అల్లకల్లోలమైన తుఫాను మధ్యలో నేను ఒంటరిగా పోరాడుతానని ఎప్పుడూ ఊహించలేదు. తల్లిదండ్రులు, ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేకుండా, ఒకప్పుడు ఆధారపడిన నా తల్లిదండ్రులు, నా సోదరుడు, నా పిల్లలు, నాకు అండగా నిలుస్తానని, నన్ను ప్రేమి...