Hyderabad, జూలై 11 -- బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల 'కేడీ - ది డెవిల్' చిత్ర బృందంతో కలిసి చెన్నైలో విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన కెరీర్, సినిమాల గురించి స్పందించాడు. అయితే స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై తనకున్న 'కోపాన్ని' వెల్లడిస్తూ.. 'లియో' సినిమాలో తనకు పరిమితమైన పాత్ర ఇవ్వడంపై గుర్రుగా ఉన్నాడు.

ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గతేడాది లియో మూవీతో హిట్ అందుకున్న సంగతి తెలుసు కదా. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు విలన్ రోల్ ఇచ్చాడు. అయితే అందులో తనను సరిగా వాడుకోలేదని సంజయ్ అలిగాడు. ఈ మధ్య చెన్నైలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులతో తన బంధం గురించి సంజయ్ దత్‌ను అడిగారు.

దీనికి సమాధానంగా అతడు మాట్లాడుతూ.. "నేను రజనీకాంత్, కమల్ హాసన్‌లను గౌరవిస్తాను. వారు నా సీనియర్లు. వారిని చూస...