భారతదేశం, మే 14 -- హీరోయిన్ కేథరిన్ థ్రెసా.. చమ్మక్ చల్లో (2013) అనే సినిమా ద్వారా టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరమ్మాయిలు మూవీతో తెలుగులో పాపులర్ అయ్యారు. నేనే రాజు నేనే మంత్రి, సరైనోడు, బింబిసార, వాల్తేరు వీరయ్య సహ తెలుగులో మరిన్ని సినిమాలు చేశారు. కన్నడ, తమిళం చిత్రాల్లోనూ నటిస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫీలింగ్ బయటపెట్టారు కేథరిన్.
తనకు ఉన్న గ్లామర్ ఇమేజ్ దాటి మరింత ప్రూవ్ చేసుకునే అవకాశాలు సరిగా రాలేదని కేథరిన్ థ్రెసా తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు. "నటిగా నన్ను సరిగా ఉపయోగించుకోవడం లేదని నేను ఫీల్ అవుతున్నా. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నేను ఇంకా చాలా చేయగలను. నా ఇమేజ్‍ను దాటి పర్ఫార్మ్ చేయడానికి నాకు ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాలేదు. నాలో చాలా సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నా" అని కేథరిన్ చెప్పారు.
ఫీమేల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.