భారతదేశం, ఆగస్టు 20 -- నటి, సింగర్ శ్రుతి హాసన్ ఇటీవల తన వ్యక్తిగత ఎంపికలు, సమాజ అంచనాలు, వినోద పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే కఠిన విమర్శల గురించి మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో తాను చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీల గురించి వస్తున్న తీర్పులపై ఆమె స్పందించారు. ఇప్పటికీ కొనసాగుతున్న ద్వంద్వ ప్రమాణాలను ఆమె ప్రశ్నించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.

THR ఇండియాతో మాట్లాడుతూ శ్రుతి హాసన్ ఇలా అన్నారు. "నేను మాట్లాడినప్పుడు, 'ఓహ్, ఈమె ప్లాస్టిక్ సర్జరీల దుకాణం' వంటి వ్యాఖ్యలు వచ్చాయి. కానీ నేను ఏమి చేశానో, ఎంత చేశానో నాకు తెలుసు. ఇతరులు ఎంత చేశారో కూడా తెలుసు. నిజాయితీకి నేను చెల్లించే మూల్యం ఇది. ఇది నాకు ఓకే. నేను ఎప్పుడూ దీనిని ప్రోత్సహించను. ఇది నా ఇష్టం" అని శ్రుతి పేర్కొన్నారు.

తన నిర్ణయాలు పూర్తిగా వ్యక్తిగతమని, ఇతరులను ప్రభావితం చేయడానికి కాదని శ్రు...