Hyderabad, ఆగస్టు 28 -- తేజ సజ్జా.. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మెరిసిన మరో హీరో. గతేడాది హనుమాన్.. ఇప్పుడు మిరాయ్ తో అతని లెవెల్ టాలీవుడ్ నుంచి నేషనల్ స్థాయికి చేరింది. కానీ తనను పాన్ ఇండియా స్టార్ అనడాన్ని మాత్రం అతడు సమర్థించడం లేదు. తాజాగా గురువారం (ఆగస్టు 28) మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా అతడు మాట్లాడాడు.

అప్పుడెప్పుడో 1998లో వచ్చిన చిరంజీవి చూడాలని ఉంది మూవీతో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ సజ్జా ఇప్పుడు హనుమాన్ తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. కానీ ఇంత సక్సెస్ సాధించినా తనను మాత్రం పాన్ ఇండియా స్టార్ అనొద్దని, తెలుగు నటుడిగానే చూడాలని తేజ కోరుతున్నాడు. మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"స్పేస్ లేకపోయినా తీసుకొని మరీ పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా స్టార్ అంటున్నారు. అ...