Hyderabad, జూలై 21 -- మహేష్ బాబు మరదలు తెలుసు కదా. అతని భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్. ఆమె తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఒక వింత అనుభవం గురించి ఇటీవల పంచుకుంది. 90వ దశకం ప్రారంభంలో హిందీ సినిమాల్లో వరుస విజయాలతో దూసుకుపోయిన శిల్ప.. ఒకసారి చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఓ పత్రికలో దీనిపై ఓ కథనం కూడా ప్రచురితమైంది. ఇది ఆమె కుటుంబంలో తీవ్ర ఆందోళన రేపింది. 'పింక్‌విల్లా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'రఘువీర్' సినిమా షూటింగ్‌లో ఉండగా ఈ సంఘటన జరిగిందని శిల్ప వెల్లడించింది.

ఇంటర్వ్యూలో శిల్ప శిరోద్కర్ మాట్లాడుతూ.. "నేను కులు మనాలిలో ఉన్నాను. అప్పుడు మాకు మొబైల్ ఫోన్లు లేవు, అందుకే మా నాన్న హోటల్‌కు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను అక్కడ సునీల్ శెట్టితో షూటింగ్ చేస్తున్నాను. అక్కడ షూటింగ్ చూస్తున్న వారంతా, వార్త తెలిసి ఉండటంతో...