Hyderabad, సెప్టెంబర్ 26 -- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్నో మంచి కార్యక్రమాలతో రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో అని కూడా అనిపించుకున్నారు. చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సల నుంచి గ్రామాలను దత్తత తీసుకోవడం వరకు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్న పిల్లలను కాపాడేందుకు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. మనసుకు హత్తుకునే పనులు చేసే మహేశ్ బాబు సినిమా షూటింగ్‌లో కూడా తోటివారికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఏం కాకుండా చూసుకుంటారని తాజాగా ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోన్న ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు గొప్పతనం గురించి చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ మదిహ నస్రీన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్ మదిహ స్పైడర్ మూవీతోపాటు డెన్వర్ ప...