Hyderabad, మే 5 -- తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఫర్వాలేదనిపిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తో సూర్య మాట్లాడాడు. తాను గొప్ప నటుడిని కాదని ఈ సందర్భంగా అతడు అనడం గమనార్హం. తన తమ్ముడు కార్తీతోనూ తనను తాను పోల్చుకున్నాడు.

రెట్రో మూవీ ప్రమోషన్లలో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్, సంతోష్ నారాయణన్ లతో సూర్య మాట్లాడాడు. ఒకప్పుడు కాక కాక, గజిని, సిల్లును ఒరు కాదల్ లాంటి వరుస హిట్స్ తో సూర్య కెరీర్ మలుపు తిరిగింది. అయితే ఈ సినిమాలు తనను నమ్మి డైరెక్టర్లు తీయడం తన అదృష్టమని సూర్య అనడం గమనార్హం. తనకు ఈ మాత్రం నటన రావడానికి కారణం డైరెక్టర్ బాల అని సూర్య చెప్పాడు. ప్రతి సినిమాలో తాను తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని...