భారతదేశం, డిసెంబర్ 21 -- 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని చెప్పారు. 174 టీఎంసీలు మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందన్నారు. విభజన సమస్యలతో పాలమూరుకు చాలా నష్టం జరిగిందన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను మార్చొద్దని ఎస్ఆర్‌సీలో స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయం మీద బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టీఎంసీలను జూరాలకు సుమోటోగా కేటాయించిందన్నారు.

పాలమూరు, నల్లగొండ జిల్లాల్లను అద్భుతంగా తీర్చిదిద్దామని కేసీఆర్ చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మండల, జిల్లాస్థాయిలో మూడు నాలుగు రోజుల్లో నేతలతో సమావేశాలు ని...