Hyderabad, జూలై 17 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు, హీరో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా నుంచి తాజాగా నదివే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. రొమాంటిక్ మెలోడీగా సాగే నదివే సాంగ్‌ను హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో రిలీజ్ చేశారు.

మనసుకు హత్తుకునే సాహిత్యంతో సాగేలా, రష్మిక, దీక్షిత్ కెమిస్ట్రీతో అట్రాక్ట్ చేసేలా ఉంది ఈ నదివే సాంగ్. మరి ఈ నదివే సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

వెలుగారునా.. న...