Hyderabad, ఏప్రిల్ 11 -- చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ ఎటువంటి లక్షణాలు చూపించకుండా మెల్లగా శరీరంలో పేరుకుపోవడం మొదలవుతుంది. కొలెస్ట్రాల్ తీవ్రంగా మారితే ధమనుల వ్యాధికి దారితీస్తుంది. నడుస్తున్నప్పుడు మీకు కొన్ని లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగిపోయిందేమో అని అనుమానించాలి.

తరచుగా నడుస్తున్నప్పుడు కాలు నొప్పి లేదా అసౌకర్యం, కండరాల బలహీనత, చల్లని పాదాలు, తిమ్మిరి, జలదరింపు లక్షణాలు నెమ్మదిగా కనిపిస్తాయి. క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.

కాలు నొప్పి లేదా అసౌకర్యం: పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పిఎడి) వల్ల కలిగే కాలు నొప్పి కొలెస్ట్రాల్ ప్రధాన లక్షణం. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు...