భారతదేశం, నవంబర్ 10 -- బాలీవుడ్ రియాలిటీ స్టార్ రాఖీ సావంత్ మరోసారి దుమారం రేపింది. ఈసారి ఆమె నటి ఊర్వశి రౌతేలాపై పరోక్షంగా విమర్శలు గుప్పించింది. తాను "పూర్తిగా సహజమైన అందగత్తెను" అని ఇటీవల ఊర్వశి చేసిన వ్యాఖ్యలను రాఖీ ప్రశ్నించింది. "మేము నీ పాత ఫొటోలు చూశాం కదా" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల 'బాలీవుడ్ బబుల్' పోడ్‌కాస్ట్‌లో పాల్గొని, తనను తాను "పూర్తిగా సహజమైన అందం", "మౌంటేన్ గర్ల్" అని చెప్పుకోవడంపై రాఖీ సావంత్ వ్యంగ్యంగా స్పందించింది. రాఖీ మాట్లాడుతూ.. "చాలా మంది తమ పక్కటెముకలు విరగ్గొట్టుకుని నడుమును సన్నగా చేసుకుంటున్నారు. ఇది నేటి కొత్త స్టైల్, తెలుసా?

వీళ్లు చైనా, భూటాన్, బ్యాంకాక్, అమెరికా, కెనడా వంటి ప్రాంతాలకు వెళ్లి.. నడుము పైభాగంలో ఉండే రెండు ఎముకలను తొలగించుకుంటారు. ఈ రోజుల్లో ఇదే ఫ్యాషన్! ...