భారతదేశం, ఆగస్టు 29 -- బిహార్​ పట్నా రోడ్ల మీద కాంగ్రెస్​- బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. జెండాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న బిహార్​ రాష్ట్రంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ నిర్వహించిన 'ఓటర్​ అధికార్​ యాత్ర'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నిరసన ప్రదర్శన చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనపై బీజేపీ నేత నితిన్ నబిన్ స్పందించారు. కాంగ్రెస్‌కు "తగిన సమాధానం" ఇస్తామని అన్నారు. "ఒక తల్లిని అవమానించినందుకు బిహార్‌లోని ప్రతి బిడ్డ కాంగ్రెస్‌కు సరైన సమాధానం ఇస్తాడు. మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము," అని ఆయన అన్నారు.

దీనికి బదులుగా.. ఒక కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ అశుతోష్ కూడా ఈ ఘటనలో అధికార పార్టీ "ప్రమేయం" ఉందని, అందుకు "తగిన సమాధానం" ఇస్తామని త...