భారతదేశం, నవంబర్ 23 -- సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ హీరోలుగా, కథనాయకులు దర్శకులుగా రాణిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ కాగా పలువురు నటులుగా ఎదిగారు. అలాగే, యూట్యూబర్స్ కూడా నటులుగా తమను తాము నిరూపించుకుంటున్నారు.

అలా ఓ యూట్యూబ్ యాంకర్ కూడా నటుడిగా మారాడు. అతనే చందు. యూట్యూబ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న చందు నటించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అలరించిన నటి జ్యోతి పూర్వజ్. బ్యూటిపుల్ జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా చేస్తున్న కిల్లర్ మూవీలో చందు ఓ పాత్ర చేశాడు.

ఈ కిల్లర్ సినిమాకు సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్, ఏ మాస్టర్ పీస్ రైజ్ ఆఫ్ సూపర్ హీరో సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా కిల్లర్ మూవీని ...