Hyderabad, అక్టోబర్ 10 -- ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10). ఇవాళ 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న రాజమౌళికి సినీ సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి టీమ్ సరికొత్తగా రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

రాజమౌళి యాక్టింగ్ చేసిన అరుదైన వీడియోను బాహుబలి టీమ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, నాజర్‌కు సన్నివేశాలను నటిస్తూ వివరించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అందులో హీరోలకు జక్కన్న ఎలా చేయాలో యాక్ట్ చేసి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

బాహుబలి టీమ్ షేర్ చేసిన రాజమౌళి యాక్టింగ్ వీడియోకు "విజన్, ధైర్యం, ప్యాషన్.. మాహిష్మతి రాజ్యాన్ని ఊహించినటువంటి విజనరీ దర్శకుడికి.. పుట్టినరోజు శుభా...