భారతదేశం, జనవరి 9 -- కన్నడ సూపర్ స్టార్, రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా 'టాక్సిక్' చిత్ర బృందం అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడంతో పాటు, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ యష్ గురించి రాసిన సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

యష్‌కు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ గీతూ మోహన్ దాస్ తన మనసులోని మాటను పంచుకున్నారు.

"అద్భుతమైన ప్రతిభ, తిరుగులేని సూపర్ స్టార్‌డమ్ రెండూ ఒకే వ్యక్తిలో ఉండటం చాలా అరుదు. ఆ అరుదైన కలయికే యష్. 'రాయా'గా అతడి నటనను ప్రపంచం ఇంక...