Hyderabad, జూలై 19 -- ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తాజాగా ఒక జ్యువెలరీ యాడ్‌లో తన అద్భుతమైన నటనతో ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్నాడు. విన్స్‌మెరా జ్యువెలరీస్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన ఈ కొత్త యాడ్‌లో.. మోహన్‌లాల్ నగలు ధరించి, డ్యాన్స్ చేస్తూ డిఫరెంట్ గా కనిపించాడు. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్ లో సెన్సేషనల్ గా మారింది.

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ఏం చేసినా ప్రత్యేకమే. అంత పెద్ద సూపర్ స్టార్ స్టేటస్ ఉండి కూడా తాజాగా తాను చేసిన ఓ జువెలరీ యాడ్ సంచలనం రేపుతోంది. ఈ యాడ్ మొదట్లో అందరూ పరిచయాలతో బిజీగా ఉండగా, మోహన్‌లాల్ ఒక జ్యువెలరీ సెట్‌ను చూసి ముచ్చటపడి.. దానిని తీసుకొని రహస్యంగా తన వానిటీ వ్యాన్‌లోకి వెళ్తాడు. ఆ జ్యువెలరీ సెట్ కనిపించకపోవడంతో, చిత్రబృందం దాని కోసం అన్ని చోట్లా వెతుకుతుంది.

మోహన్‌లాల్ తన షర్ట్ ప్యాంటుకు తగినట్లుగా ఆభరణాలు - నెక్లె...