Telangana,suryapet, అక్టోబర్ 7 -- సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ బయటపడింది. ముఖ్యమంత్రి సహాయ నిధి స్కీమ్ డబ్బులను కాజేసేలా నకిలీ లబ్ధిదారులను సృష్టించి. చెక్కులను డ్రా చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 8 మందిని మేళ్లచెర్వు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే దగ్గర పని చేసిన వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నారు.

నిందితుల వద్ద నుంచి రూ.7.3 లక్షల నగదు. వినియోగించని 44 చెక్కులు, ఆరు బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కొత్తపల్లి నర్సింహ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మేళ్లచెర్వుకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యానికి గురై ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌ కోసం అప్పటి ఎమ్మెల్యే సైదిరెడ్డి ద్వారా దరఖాస్తు చేశాడు. నెలలు గడుస్తున...